తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కమలాకర కామేశ్వరరావు

Kamalakara Kameswara Rao

TeluguISM Quiz - Kamalakara Kameswara Rao
0 178

Kamalakara Kameswara Rao – Quiz : కమలాకర కామేశ్వరరావు (అక్టోబర్ 4, 1911 – జూన్ 29, 1998) పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి.

కృష్ణా పత్రికలో ‘సినీఫాన్’ అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్ , ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. ‘గుడ్ ఎర్త్ ‘ అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు.

ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “ద్రౌపదీ మానసంరక్షణం” చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే ‘వస్త్రాపహరణం’ ఆర్థికంగా విజయవంతమైంది; ‘మానసంరక్షణం’ దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం ‘మానసంరక్షణం’ ‘వస్త్రాపహరణం’ కంటే మంచి చిత్రమని ప్రశంసించాడు.

 

More About : Kamalakara Kameswara Rao

 

కమలాకర కామేశ్వరరావు క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : కమలాకర కామేశ్వరరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kamalakara Kameswara Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కామేశ్వరరావు దర్శకత్వంలో ఎస్.వి.రంగారావుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ?

2. ఏ సంవత్సరంలో కమలాకర కామేశ్వరరావు బాల భారతం సినిమాను తీసారు ?

3. కమలాకర కామేశ్వరరావుకు దర్శకుడిగా తొలిసారి బ్రేక్‌నిచ్చిన చిత్రం ?

4. కమలాకర కామేశ్వరరావును తొలిసారి చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టించిన సినిమా ?

5. నాగార్జున ‘అల్లరి అల్లుడు’ సినిమాకు నిర్మాత ఎవరు?

6. పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు ?

7. కమలాకర కామేశ్వరరావు తొలిసారిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సంవత్సరం ?

8. కమలాకర కామేశ్వరరావు స్వస్థలం ?

9. మహామంత్రి తిమ్మరసుకు ఏ సంవత్సరంలో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించినది ?

10. కమలాకర కామేశ్వరరావు తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : శోభన్ బాబు

 

Leave A Reply

Your Email Id will not be published!