కె. విశ్వనాథ్
Kasinadhuni Viswanath - Quiz
Kasinadhuni Viswanath – Quiz : కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్(Kasinadhuni Viswanath). సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్(Kasinadhuni Viswanath) దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది.
భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి.
దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు.
సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు(Kasinadhuni Viswanath). కళాతపస్వి ఆయన బిరుదు.
కె. విశ్వనాథ్ క్విజ్