కాసు బ్రహ్మానందరెడ్డి
Kasu Brahmananda Reddy
Kasu Brahmananda Reddy – Quiz : కాసు బ్రహ్మానందరెడ్డి (జూలై 28, 1909 – మే 20, 1994) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజక వర్గం నుండి ఎన్నికై, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా కొనసాగాడు. కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీలో చీలిక వచ్చినపుడు ఒక వర్గానికి తాను నేతృత్వం వహించి, రెడ్డి కాంగ్రెసును ఏర్పరచాడు.
పన్నెండటవ ఏట విజయవాడ కాంగ్రెస్ సదస్సుకు విచ్చేసిన మహాత్మా గాంధీని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం ఖద్దరు ధరించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా’ ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు.
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. మొదటి సారిగా 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీ శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1952 లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పల్నాడు నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి, సీపీఐ అభ్యర్థి కోలా సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులంతా ఆంధ్రప్రదేశ్ లోనూ సభ్యులుగా కొనసాగారు.
ఆ విధంగా బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడై, నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో పురపాలన శాఖ మంత్రిగా చేరాడు. ఆ తరువాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖలు నిర్వహించాడు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో అతడు 1971 సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించాడు.
More About : Kasu Brahmananda Reddy
కాసు బ్రహ్మానందరెడ్డి క్విజ్