కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
Komarraju Venkata Lakshmana Rao - Quiz
Komarraju Venkata Lakshmana Rao – Quiz : కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (మే 18, 1877 – జూలై 12, 1923) తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త,విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు.
తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త.
కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత.
అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు(Komarraju Venkata Lakshmana Rao) ఒకడు. ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం.
More About Komarraju Venkata Lakshmana Rao
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్విజ్