తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కొండ వెంకటప్పయ్య

Konda Venkatappaiah - Quiz

TeluguISM Quiz - Konda Venkatappaiah
0 436

Konda Venkatappaiah – Quiz : కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866 – ఆగష్టు 15, 1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు.ఇతను గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‍కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.

1866, ఫిబ్రవరి 22 న పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. ప్రాథమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టా పొంది, బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌరవ్యవహారాలలో ఎక్కువ ఆసక్తి ఉండటం వలన, అవే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు.

1912 మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలేదు. కొవ్వూరు నుంచి బెజవాడ వరకు కృష్ణా జిల్లాయే. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు.

1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు మొదటి ఆంధ్ర మహాసభ (ఆంధ్ర) బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర.

 

More About : Konda Venkatappaiah

కొండ వెంకటప్పయ్య క్విజ్

0%
0 votes, 0 avg
7

Quiz : కొండ వెంకటప్పయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Konda Venkatappaiah - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కృష్ణా పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

2. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర ఏ సంవత్సరంలో ప్రచురించారుశ?

3.  ఏ సంవత్సరంలో కొండా వెంకటప్పయ్య మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు ?

4. ఎక్కడ జరిగిన ఆంధ్రమహాసభకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు ?

5. దేశభక్త కొండా వెంకటప్పయ్య జన్మించి ఊరు ?

 

" కాంగ్రెస్‌ వర్స్‌ దేన్‌ ది బ్రిటిష్‌ " అనే శీర్షికతో వార్తను ప్రచురించిన పత్రిక ఏది ?

7. కొండా వెంకటప్పయ్య ఎప్పుడు మరణించారు ?

 

8. కొండా వెంకటప్పయ్య అఖిలాంద్ర దేశ పటాన్ని ఏ సంవత్సరంలో తయారు చేసాడు ?

9. కొండా వెంకటప్పయ్య రచించిన "ఆధునిక రాజ్యాంగ సంస్థలు"పుస్తకం ఏ సంవత్సరంలో ముద్రించబడింది ?

10. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఏర్పడినప్పుడు తొలి కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు ?

 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Read More : తెన్నేటి విశ్వనాథం

Leave A Reply

Your Email Id will not be published!