తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కొంగర జగ్గయ్య

Kongara Jaggayya - Quiz

TeluguISM Quiz - Kongara Jaggayya
0 313

Kongara Jaggayya : కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 – మార్చి 5, 2004) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన అతను కంఠం కారణంగా అతను “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్పతి”గా పేరుగాంచాడు. భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డ్ ను ఇచ్చి సత్కరించింది.

11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు.విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు.

ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పనిచేశాడు.

ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు; జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు.

చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశాడు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు.

త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేసాడు. అయితే ఈ సినిమాగానీ, దీని తదుపరి చిత్రాలు కాని పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టాడు. తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు.

 

More About : Kongara Jaggayya 

కొంగర జగ్గయ్య క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : కొంగర జగ్గయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kongara Jaggayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జురాసిక్ పార్క్ లోని రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తెలుగులోకి డబ్బింగు ఇచ్చిన వ్యక్తి  ?

2. రవీంద్రుని గీతాంజలిని ఏ పేరుతో కొంగర జగ్గయ్య తెలుగులోకి అనువాదించినారు ?

3. కొంగర జగ్గయ్యకు పేరు తెచ్చిపెట్టిన నాటిక ఏది ?

4. కొంగర జగ్గయ్య ఏ పత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేసాడు ?

5. జగ్గయ్య నిర్మించిన ఏ సినిమాకు  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 50,000 రూపాయల ప్రోత్సాహకం లభించింది. ?

6. లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు ఎవరు ?

7. క్రింద వారిలో కళా వాచస్పతి బిరుదాంకితుడు ?

8. ఎన్.టి.రామారావు,కొంగర జగ్గయ్య కలిసి స్థాపించిన రవి ఆర్ట్ థియేటర్ ఎక్కడ గలదు ?

9. ఏ పార్టీ తరుపున కొంగర జగ్గయ్య లోక్‌సభకు ఎన్నికయ్యాడు ?

10. రవి ఆర్ట్ థియేటర్ స్థాపకులు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : గుమ్మడి వెంకటేశ్వరరావు

 

Leave A Reply

Your Email Id will not be published!