ఎల్ వి ప్రసాద్
L V Prasad - Quiz
L V Prasad – Quiz : ఎల్ వి ప్రసాద్ (జనవరి 17, 1908 – జూన్ 22, 1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్(L V Prasad) ను ఆకర్షించేవి.
పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్(L V Prasad) తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.
ప్రసాద్ బొంబాయి (ముంబై) చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు 15 రుపాయల వేతనంతో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా పనిచేశారు. అచట ఇండియా పిక్చర్స్ అక్తర్ నవాజ్ తను నిర్మిస్తున్ననిశ్శబ్ద చిత్రం “స్టార్ ఆఫ్ ది ఈస్ట్”లో చిన్న పాత్ర ఇచ్చాడు.
1931 లో, అతను వీనస్ ఫిలిం కంపనీలో చేరాడు. భారతదేశం యొక్క మొదటి “టాకీ”, ఆలం అరాలో నాలుగు చిన్నచిన్న పాత్రలలో నటించాడు. తరువాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి.
More About : L.V.Prasad
ఎల్ వి ప్రసాద్ క్విజ్