తెలుగు ఇజం = మన భాష + మన నైజం

మాడపాటి హనుమంతరావు

Madapati Hanumantha Rao

TeluguISM Quiz - Madapati Hanumantha Rao
0 185

Madapati Hanumantha Rao – Quiz : మాడపాటి హనుమంతరావు (జనవరి 22, 1885 – నవంబరు 11, 1970) ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు.

న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి, విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు. తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు.

అయితే నైజాం ప్రాంతంలో తర్వాతి తరం రాజకీయ నాయకత్వం ఏర్పడడానికి పునాదిగా వీరు చేసిన కృషి సార్థకమైనది. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు.

 

More About : Madapati Hanumantha Rao

 

మాడపాటి హనుమంతరావు క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : మాడపాటి హనుమంతరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Madapati Hanumantha Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మాడపాటి హనుమంతరావు ఎప్పుడు మరణించారు ?

2. 4 వ ఆంధ్రమహాసభ కు అధ్యక్షత వహించిన వారు ?

3. "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే

అని మాడపటి హనుమంతరావు గురించి కీర్తించినవారు ?

4. ఆంధ్ర మహాసభలు ఎవరి అధ్యక్షతన నెలకొల్పారు ?

5. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) రచించిన వారు ?

6. మాడపటి హనుమంతరావు అధ్యక్షత వహించిన 4 వ ఆంధ్రమహాసభ ఎప్పుడు జరిగినది ?

7. మాడపాటి హనుమంతరావు ఎప్పుడు జన్మించారు ?

8. శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినవారు ?

9. ఏ సంవత్సరంలో మాడపాటి హనుమంతరావు హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ?

10. తెలంగాణా ఆంధ్రోద్యమం పుస్తక రచయిత?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : అల్లూరి సీతారామరాజు

Leave A Reply

Your Email Id will not be published!