తెలుగు ఇజం = మన భాష + మన నైజం

మందుముల నరసింగరావు

Mandumula Narasing Rao

TeluguISM Quiz - Mandumula Narasing Rao
0 373

Mandumula Narasing Rao – Quiz : పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు, పత్రికా రచయితగా పేరుపొందాడు.

1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు) లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు.

1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ “50 సంవత్సరాల హైదరాబాదు” గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు.

 

More About : Mandumula Narasing Rao

 

మందుముల నరసింగరావు క్విజ్

0%
0 votes, 0 avg
12

Quiz : మందుముల నరసింగరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Mandumula Narasing Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1.  1927 సంవత్సరంలో రయ్యత్ పత్రికకు సంపాదకుడు ఎవరు ?

2. మందుమల నరసింగరావు అధ్యక్షతన జరిగిన 6 వ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగినది ?

3. మందుముల నరిసింగరావు ఏ పార్టీ తరుపున  కల్వకుర్తి నుండి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు ?

4. మందుముల నరిసింగరావు ఎప్పుడు మరణించారు ?

5. ఏ ఉద్యమంలో పాల్గొని మందుముల నరిసింగరావు అరెస్టు అయ్యాడు.?

6. నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం మొట్టమొదట సహాయ కార్యదర్శి ఎవరు ?

 

7. మందుముల నరిసింగరావు సంపాదకుడిగా ఉన్న రయ్యత్ పత్రిక ఏ భాషలో వెలువడినది ?

8. ఎవరి అధ్యక్షతన మందుముల నరిసింగరావు 'యంగ్‌మెన్ యూనియన్’స్థాపించారు ?

9. మందుముల నరిసింగరావు ఎప్పుడు జన్మించారు ?

10. మితవాదుల వర్గం 12 వ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : కల్లూరి చంద్రమౌళి

Leave A Reply

Your Email Id will not be published!