తెలుగు ఇజం = మన భాష + మన నైజం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ

Mangalampalli Balamuralikrishna - Quiz

TeluguISM Quiz - M. Balamuralikrishna
0 167

Mangalampalli Balamuralikrishna – Quiz : మంగళంపల్లి బాలమురళీకృష్ణ (జూలై 6, 1930 – నవంబర్ 22, 2016) కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.

8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. అతను వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు(Mangalampalli Balamuralikrishna).

భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు.

ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు. చెన్నై లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు(Mangalampalli Balamuralikrishna).

 

More About Mangalampalli Balamuralikrishna

మంగళంపల్లి బాలమురళీకృష్ణ క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Mangalampalli Balamuralikrishna - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. బాలమురళీకృష్ణ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రసీమకు పరిచయం చేసిన సినిమా ఏది ?

2. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎప్పుడు జన్మించారు ?

3. ఏ సంవత్సరంలో బాలమురళీకృష్ణ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రసీమకు పరిచయం అయ్యాడు ?

4. ఏ ప్రభుత్వం నుండి చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని అందుకున్నారు ?

5. ఏ సంవత్సరంలో  తెలుగు విశ్వవిద్యాలయం నుండి బాలమురళీకృష్ణ సంగీతంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు ?

 

 

6. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎప్పుడు మరణించారు ?

7. బాలమురళీకృష్ణ చివర కచేరి ఎక్కడ చేశారు ?

8. మురళీమాధురి అనే పుస్తకం ఎవరి గురించి రాసినది ?

9. సంగీతకారులలో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి ఎవరు ?

10. మద్రాసు సంగీత అకాడమీ నుంచి కర్ణాటక సంగీతంలో బాలమురళీకృష్ణ అందుకున్న పురస్కారం ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : ఘంటసాల

Leave A Reply

Your Email Id will not be published!