నాగభూషణం
Nagabhushanam
Nagabhushanam – Quiz : చుండి నాగభూషణం (ఏప్రిల్ 19, 1921 – మే 5, 1995) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను.
ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు ఆర్థికలోపం కారణంగా వెనకడుగువేయడంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు నెలకు పాతిక రూపాయల జీతంతో సెంట్రల్ కమర్షియల్ సూపరిడెంట్ కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. దాంతో మద్రాసుకు మకాం మర్చారు.
ఎస్.వి.రంగారావు కొన్ని సాంఘిక చిత్రాలలో ప్రతినాయకుని వేషం వేసినా అవి సంఖ్యాపరంగా చాలా తక్కువ. ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కథానాయకునితో ఫైటింగులు చేసే ప్రతినాయకులు. విలనిజానికి ఒక ప్రత్యేక పంథాను ప్రవేశపెట్టి, కామెడీ టచ్ ఇచ్చిన నటులు నాగభూషణం. కథను హీరో నడిపిస్తుంటే ఆ హీరోను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి కథలో విలనుండాలి. అందులో ఆరితేరినవాడు, కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెరరూపం నాగభూషణం.
More About : Nagabhushanam
నాగభూషణం క్విజ్
Also Read : రాజనాల నాగేశ్వరరావు