Nutan Prasad
Nutan Prasad - Quiz
Nutan Prasad – Quiz : నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ (డిసెంబర్ 12, 1945 – మార్చి 30, 2011) అసలు పేరు తడినాధ వరప్రసాద్(Nutan Prasad). 1970వ, 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.
ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’,
‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్(Nutan Prasad) నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.
1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా..,
ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు నూతన్ (Nutan Prasad).
More About : Nutan Prasad
నూతన్ ప్రసాద్ క్విజ్