ఓగిరాల రామచంద్రరావు
Ogirala Ramachandra Rao
Ogirala Ramachandra Rao – Quiz : ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 – జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం కూడా వేశారు.
సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పనిచేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే. వాహిని వారి చాలా చిత్రాలకు ఈయన పనిచేశారు. అందులో నాగయ్యగారికి సహాయకునిగా స్వర్గసీమ (1945), యోగి వేమన (1947) వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గుణసుందరి కథ (1949), పెద్దమనుషులు (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి పనిచేసిన చిత్రాలు, ఈ రెండు చిత్రాలకు ఆయనకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా అద్దేపల్లి రామారావు పని చేయడం విశేషం.
More About : Ogirala Ramachandra Rao
ఓగిరాల రామచంద్రరావు క్విజ్