ప్రగడ కోటయ్య
Pragada Kotaiah
Pragada Kotaiah – Quiz : ప్రగడ కోటయ్య ( 1915జూలై 26 – 1995నవంబరు 26) ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు.
ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా, నిడుబ్రోలులో చేనేత వృత్తి చేసుకొనే ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915, జూలై 26న రెండవ కుమారుడుగా జన్మించాడు. ఇతడికి ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. 1931లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్కూలు ఫైనల్ ప్యాసయ్యాడు. కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసాడు. ఇతడి కుటుంబం చీరాల ఈపురుపాలెంలో కొంతకాలం నివాసం ఉంది. ఇతడి వివాహం ఇందిరాదేవితో జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.
ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలో భారతీయ చేనేత పరిశ్రమ పై పరిశోధన జరిపిన ఆచార్య ఎన్ జి రంగా సలహా మేరకు మద్రాసు లోని టెక్స్‌టైల్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేసాడు. ఇదే అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశాడు.
More About : Pragada Kotaiah
ప్రగడ కోటయ్య క్విజ్