రాజనాల కాళేశ్వరరావు
Rajanala Kaleswara Rao
Rajanala Kaleswara Rao – Quiz : రాజనాల (జనవరి 3, 1925 – మే 21, 1998) తెలుగు సినిమానటుడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించాడు. తెలుగు సినిమా, నాటకాల్లో ఎక్కువగా నటించాడు. కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించాడు.
నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు). ఈయన 1925, జనవరి 3న జన్మించాడు. ఇంటర్ చదువుతూనే 1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే నాటక సంస్థను ప్రారంభించాడు.
1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపువచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1953లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
More About : Rajanala Kaleswara Rao
రాజనాల కాళేశ్వర రావు క్విజ్