రాజనాల నాగేశ్వరరావు
Rajanala Nageswara Rao
Rajanala Nageswara Rao – Quiz : ఆర్.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 – 1959). విలన్ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్.నాగేశ్వరరావు.
“బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన “అదే మామా మన తక్షణ కర్తవ్యం” అంటూ పలికిన డైలాగ్ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్ అన్నపూర్ణా వారి దొంగరాముడు చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి మాయాబజార్ చిత్రంలోనిది. కౄరమైన పాత్రలు పోషించడంలో ఆర్.నాగేశ్వరరావు తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్ రాముడు వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు.
More About : Rajanala Nageswara Rao
రాజనాల నాగేశ్వరరావు క్విజ్
Also Read : రాజనాల కాళేశ్వరరావు