తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఎస్.వి. రంగారావు

S V Ranga Rao - Quiz

TeluguISM Quiz - S. V. Ranga Rao
0 493

S V Ranga Rao – Quiz : ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 – జులై 18, 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.

కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు(S V Ranga Rao) కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం.

దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు(S V Ranga Rao).

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు.

 

More About  S. V. Ranga Rao

ఎస్.వి. రంగారావు క్విజ్

0%
2 votes, 4 avg
34

Quiz : ఎస్.వి. రంగారావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

S. V. Ranga Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఎస్. వి. రంగారావు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవారు ?

2. ఎస్. వి. రంగారావు ఎప్పుడు మరణించారు ?

3. ఆంధ్రప్రదేశ్ ఏ ముఖ్యమంత్రి  పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ?

4. ఎస్. వి. రంగారావు దర్శకత్వం వహించిన ఏ చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.?

5. ఎస్. వి. రంగారావు నటించిన మొదటి సినిమా ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

6. ఎస్. వి. రంగారావు నటించిన ఏ సినిమాకు గాను ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు ?

 

7. ఎస్. వి. రంగారావు నటించిన ఏ సినిమాకు గాను రాష్ట్రపతి అవార్డును అందుకున్నాడు ?

8. ఎస్. వి. రంగారావుకు సంబంధించినది ?

9. భారత తపాలాశాఖ ఏ సంవత్సరంలో ఎస్. వి. రంగారావు జ్ఞాపకార్థం తపాళాబిళ్ళలను విడుదల చేసింది ?

10. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం అని అన్నదేవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

Leave A Reply

Your Email Id will not be published!