తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఎస్.వరలక్ష్మి

S. Varalakshmi

TeluguISM Quiz - S.Varalakshmi
0 128

S. Varalakshmi – Quiz : ఎస్.వరలక్ష్మి (ఆగస్ట్ 13, 1937 – సెప్టెంబర్ 22, 2009) తెలుగు సినిమా నటీమణి, గాయని.

ఈమె 1937 సంవత్సరం జగ్గంపేటలో జన్మించారు. అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు.

యస్.వరలక్ష్మి గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం ‘బాలయోగిని’ (1937) తర్వాత ‘రైతుబిడ్డ’ (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. ‘ఇల్లాలు’లో ఆమె పాడిన ‘కోయిలోకసారొచ్చి కూసిపోయింది’ పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. ఎస్.రాజేశ్వరరావుతో కలిసి ‘శాంత బాలనాగమ్మ’ (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత ‘మాయాలోకం’ (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది ‘పల్నాటి యుద్ధం’ చిత్రంతోనే. ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు.

 

More About : S. Varalakshmi

 

ఎస్.వరలక్ష్మి క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : ఎస్.వరలక్ష్మి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

S. Varalakshmi - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మాయలోకం తెలుగు జానపద చలన చిత్రంలో రంగసాని పాత్ర పోషించినవారు ?

2. అక్కినేని నాగేశ్వరరావు సరసన సీత పాత్రలో ఎస్.వరలక్ష్మి నటించిన సినిమా ?

3. వీరపాండ్య కట్టబ్రాహ్మణలో రాణి జక్కమ్మ పాత్ర పోషించిన నటి ?

4. ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేసిన ఏ సినిమాకు ఎస్.వరలక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు ?

5. లవకుశలో ఎస్.వరలక్ష్మి ఏ పాత్రను పోషించినది ?

6. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో కృష్ణదేవరాయలా భార్య తిరుమల దేవిగా నటించిన వారు ?

7. వరలక్ష్మీ పిక్చర్స్ స్థాపించినవారు ?

8. ఎస్.వరలక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన సినిమా ?

9. సతీ సావిత్రిలో అక్కినేని నాగేశ్వర్ రావు ( సత్యవంతుడుగా) సరసన సావిత్రి గా నటించిన హీరోయిన్?

10. అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి కచేరి చేసిన అలనాటి నటి గాయని ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : జి.వరలక్ష్మి

Leave A Reply

Your Email Id will not be published!