తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 36

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 36
0 364

Telugu States General Knowledge Quiz  (Charminar & Makkah Masjid) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

చార్మినార్ – (నాలుగు మినార్లు) భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తిలో ఉన్న స్మారక చిహ్నం, మసీదు. ఇది నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్ గా అవతరించింది. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్ 400 సంవత్సరాలకు పైగా పై అంతస్తులో మసీదుతో ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఇక్కడ ఈద్-ఉల్-అజ్, ఈద్-ఉల్-ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు.

ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టు ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్, పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి. చార్మినార్‌ పనులు పూర్తయిన మరుసటి యేడాది 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించారు. చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌లను నిర్మించారు.

More About : చార్మినార్

 

మక్కా మస్జిద్ (హైదరాబాదు, భారతదేశం) భారతదేశంలోని ప్రాచీన, పెద్దవైన మస్జిద్ లలో ఒకటి. 1617 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి ల ఆధ్వర్యంలో ఈ మస్జిద్ ను కట్టించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానా షా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది, 1694 లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు పూర్తికావించాడు. దీనినిర్మాణంకొరకు 8000 మంది పనివారు పనిచేశారు, 77 సంవత్సరాలు పట్టింది.

చార్మినారుకు నైరృతిదిశలో 100గజాల దూరంలోవున్న ఈ మస్జిద్ నిర్మాణంకొరకు మక్కా నుండి ఇటుకలు తెప్పించారని నమ్ముతారు. వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మస్జిద్ గా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు 220 అడుగుల వెడల్పూ 180 అడుగుల పొడవూ కలిగి ఉంది. ఈ మస్జిద్ లో మహమ్మదు ప్రవక్త యొక్క “పవిత్ర కేశం” భద్రపరచబడియున్నది.

 

More About : మక్కా మస్జిద్ 

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 36

0%
0 votes, 0 avg
7

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 36

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 36

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. చార్మినార్‌కు ఉత్తరాన గల 4 కమాన్ మధ్య ఉన్న ఫౌంటెన్ పేరు ?

2. చార్మినార్ ను ఎవరు కట్టించారు?

3. చార్మినార్ ఒక ప్రతిరూపాన్ని ఏ దేశంలో  నిర్మించారు?

4. ఏ సంవత్సరంలో చార్మినార్‌కు మరమ్మతులు చేపట్టారు ?

5. హైద్రాబాద్ లోని మక్కామసీదు యందు ఒకేసారి ఎంత మంది ప్రార్థనలు చేసుకోవచ్చు ?

6. మక్కామసీదు నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ?

7. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఏమి నిర్మించారు?

8. చార్మినార్‌కు ఉత్తరాన గల 4 కమాన్ లు ఏవి ?

9. చార్మినార్ లో  గడియారంను అమర్చినవాళ్ళు ?

10. చార్ మినార్ కూడలి దేనికి నమునాగా రూపొందించబడినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 35

Leave A Reply

Your Email Id will not be published!