తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 44
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (గద్వాల కోట & ఆలయాలు) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
గద్వాల కోట : మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధిచెందినది. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నవి.
ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించబడింది. లోపలి వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మించబడింది. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరుచుగా కూలిపోతున్నప్పటికీ, లోపలి వైపు రాతి గోడ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట బయట చుట్టూరా నీటితో నింపడానికి కందకం నిర్మించారు. నేటికీ కందకం పట్టణంలోని మురికి నీటితో నిండి నాటి దృశ్యాన్ని తలపిస్తుంది.
More About : గద్వాల కోట
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 44