తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 48
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (పురాతన కట్టడాలు – నిజామాబాద్) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
పురాతన కట్టడాలు – నిజామాబాద్ : దోమకొండ సంస్థానం –
ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి.
సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో, ఇందూరు జిల్లాగా ఉంది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూర్ తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా, బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు.
భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు. జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి – ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు.
More About : పురాతన కట్టడాలు – నిజామాబాద్
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 48