తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 52

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 52
0 249

Telugu States General Knowledge Quiz : గండికోట – దేవాలయాలు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

గండికోట : వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది.పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రం.

గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (క్రీ.శ. 1123 జనవరి 9) నాడు చిన్న మట్టికోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (క్రీ.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు.

 

More About : గండికోట

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 52

0%
1 votes, 1 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 52

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 52

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. గండికోట ఏ నది పరివాహక ప్రాంతంలో కలదు ?

2. కడప జిల్లా, నందలూరు గ్రామంలో సౌమ్యనాథస్వామి దేవాలయం ను నిర్మించిన వారు ?

3. గండికోట ను నిర్మించిన రాజవంశస్థులు ఎవరు ?

4. విజయనగర సామ్రాజ్య కాలములో ఏ మండలంలోని ఓ ప్రాంతానికి గండికోట రాజధాని గా ఉండేది ?

5. అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని ఏ శాసనం చెప్తుంది ?

6. కుళోత్తుంగ చోళుడు సౌమ్యనాథస్వామి దేవాలయం ను ఏ శతాబ్ధంలో నిర్మించాడు ?

7. గండికోటను కమ్మనాయకులు ఎంతా కాలం పాలించిన వారు ?

8. రంగనాథాలయం నిర్మించినవారు ?

9. దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ గా పిలవబడే దర్గా ఎక్కడ కలదు ?

10. గండికోటను సందర్శించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 51

Leave A Reply

Your Email Id will not be published!