తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 55

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 55
0 239

Telugu States General Knowledge Quiz : నిర్మల్ – మంచిర్యాల కట్టడాలు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

నిర్మల్ కోట :  తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో పేరు సంపాదించిన నిర్మల్ కు సుమారు 400 ఏళ్ల ఘన చ‌రిత్ర ఉంది. చారిత్రక ఖిల్లాగా.. నిజాం జమానాలోనే రెవెన్యూ జిల్లాగా.. రాజకీయ కేంద్రంగా.. పేరొందిన నిర్మల్‌ ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.

1747లో ప్రెంచి ఇంజనీర్ల సహాయంతో నిర్మల్‌ గిరిదుర్గాను నిర్మించడం జరిగింది. నిర్మల్‌ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. శత్రువులు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశారు. పట్టణం చుట్టూ నిర్మించిన ప్రధానమైన రక్షణ గోడతో పాటు, రాజ సౌధం (ఖిల్లా గుట్ట) చుట్టు మరొక పటిష్ఠమైన రాతి గోడను నిర్మించారు. దీనినే ‘ఆంజనేయదుర్గం’ అంటారు.

కోటలోకి వెళ్ళడానికి తూర్పువైపు సింహద్వారం, దక్షిణ, ఉత్తర దిశల్లో మరో రెండు ప్రధాన ద్వారము, సింహ ద్వారానికి దగ్గరలో తూర్పుకు ఒక చిన్న ద్వారం, సభాభవనం, హవామహల్‌, అంతఃపురసౌధం, మంచినీటి కోనేరుబావి, ఇలా ఆనాటి రాతినిర్మాణాలు ఉన్నాయి.

More About : నిర్మల్ 

 

గాంధారి ఖిల్లా, మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని కొండమీద ఉన్న కోట. ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం చివరి వరకు పోరాటం రాజ్‌ గోండ్‌’ లు ఈ కోటను నిర్మించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 55

0%
0 votes, 0 avg
0

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 55

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 55

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. రెండవ అన్నవరంగా పిలిచే సత్యనారాయణ స్వామి ఆలయం ఎక్కడ కలదు ?

2. క్రింది వారిలో ఎవరి పేరు మీదుగా ఆదిలాబాద్కు ఆ పేరు వచ్చింది ?

3. కెరిమెరి ఘాట్ ఏ జిల్లాలో కలదు ?

4. గాంధారి ఖిల్లా నిర్మించిన వారు ?

5. నిర్మల్ కోటను నిర్మించినవారు ?

6. గొండులు ఎవరి సహాయంతో గాంధారి ఖిల్లాను నిర్మించారు ?

7. ఏ శాతబ్దం వరకు గాంధారి ఖిల్లా నిర్మాణం కొనసాగింది ?

8. నిర్మల్ ను పాలించిన నాయకుడు ఎవరు ?

9. నిర్మల్‌ కోటను ఏ సంవత్సరంలో నిర్మించారు ?

10. తెలంగాణ కాశ్మీర్ గా ఏ జిల్లాను పిలుస్తారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 54

 

Leave A Reply

Your Email Id will not be published!