తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 58
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (ఉదయగిరి కోట – కర్నూలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
ఉదయగిరి కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం,ఉదయగిరిలో ఉంది.
నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి.
చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235 వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు 1514 వ సంవత్సరంలో జూన్ 9 న ఈ దుర్గాన్ని వశపరచు కున్నాడని చారిత్రకాధారం. 1540 వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామ రాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579 లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించారని తెలుస్తున్నది.
More About : ఉదయగిరి కోట
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 58