తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 60
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (గుంటూరు జిల్లా – కోటలు) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
గుంటూరు జిల్లా – కోటలు :
కొండవీడు కోట : కొండవీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా,యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది.రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ.పూ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.
ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ.పూ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ.పూ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది.
More About : కొండవీడు కోట
More About : నరసరావుపేట రాజాగారికోట
More About : కోటప్పకొండ దేవాలయం
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 60