తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 63

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 63
1 277

Telugu States General Knowledge Quiz : (విజయనగరం కట్టడాలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

విజయనగరం కోట: దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 18 వ శతాబ్దపు కోట. దీనిని 1713 లో విజయనగర మహారాజు విజయ రామరాజు నిర్మించారు.ఈ కోట నిర్మించకుముందు వారు కుమిలి అనే ప్రదేశంలో మట్టి కోటలో ఉన్నట్లు తెలుస్తుంది. కోటకు పునాది వేసిన అధికారక వేడుకరోజు చాలా శుభప్రదమైంది. ఎందుకంటే ఇది విజయానికి ఐదు సంకేతాలను సూచిస్తుంది. చదరపు ఆకారంలో ఉన్న కోటలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ప్రవేశ ద్వారం “నగర్ ఖానా” విస్తృతమైన నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది.కోట లోపల అనేక దేవాలయాలు, రాజభవనాలు, విజయానికి చిహ్నంగా నిర్మించిన టవర్ ఉన్నాయి.

 

More About : విజయనగరం కోట

More About : కురుపాం కోట

 

బొబ్బిలి కోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, బొబ్బిలిలో ఉంది.ఇది విజయ నగరం జిల్లాకు 60.కి.మీ.దూరంలో ఉంది.ఇది 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించబడిన కోట. బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు. (రాయుడప్ప రంగారావు). ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం (చికాకోల్) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ (టైగర్) కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు.

ఆరకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు.షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు.ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని పేరు పెట్టాడు.తరువాత అది రానురాను బొబ్బిలిగా రూపాంతరం చెందింది. ఈ రాజవంశీయులకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశాడు.

More About : బొబ్బిలి కోట

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 63

0%
0 votes, 0 avg
1

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 63

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 63

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. విజయనగరం కోట ఏ శతాబ్దానికి సంబంధించినది ?

2. సాలూరు కోట ఏ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో కలదు ?

3. బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు ఎవరు ?

4. బొబ్బిలి కోటలోని మూడవ కోటను నిర్మించిన వారు ?

5. విజయనగరం కోటలో మోతీ మహల్ నిర్మించిన వారు ?

6. బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగినది ?

7. పౌరుషానికి  ప్రతీకగా చెప్పే బొబ్బిలి ఏ జిల్లాలో కలదు?

8. విజయనగరం కోట ను ఏ సంవత్సరంలో నిర్మించారు ?

9. ఏ రాజు వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారని చరిత్రాకారుల అభిప్రాయం?

10. రాణి చెల్లాయమ్మదేవి బొబ్బిలి కోటలోని మూడవ కోటను ఏ శతాబ్దంలో నిర్మించినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 62

1 Comment
  1. Hareesh says

    Nice

Leave A Reply

Your Email Id will not be published!