తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 70
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (నాగార్జునకొండ) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
నాగార్జునకొండ –
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ. ఇది చారిత్రక పట్టణం కాగా ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, సా.శ.పూ. 2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన ప్రదర్శనశాల లో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాల ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి. అమరావతి స్తూపం చారిత్రక స్థలం నుండి ఇది పశ్చిమంగా 160 కి.మీ దూరంలో వుంది.
మహాయాన బౌద్ధం,హిందూమతం సంబంధించిన ఆలయాల అవశేషాలు ఇక్కడవున్నాయి. ఈ స్థలం బౌద్ధక్షేత్రాలలో అత్యంత విలువైనది. ఇక్కడి బౌద్ధ విశ్వవిద్యాలయాలు, ఆరామాల లో చదువుకొనటచానికి చైనా, గాంధార, బెంగాలు, శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చేవారు.
నాగులు, యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ శాతవాహన రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం.
ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.
ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో “విజయపురి” అనే పేరుతో నగరాన్ని నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం – విజయపురి క్రీ.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
More About : నాగార్జునకొండ
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 70