తెన్నేటి విశ్వనాథం
Tenneti Viswanadham - Quiz
Tenneti Viswanadham : తెన్నేటి విశ్వనాధం (1895-1979) విశాఖపట్నానికి చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ, రెవిన్యూ శాఖామంత్రి. విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి.
1895లో విశాఖపట్నం జిల్లా లక్కవరంలో జన్మించిన విశ్వనాథం మద్రాసులో బి. ఎ., ఎం. ఎ. పూర్తి చేసి, ట్రివేండ్రంలో లా పట్టా తీసుకుని విశాఖపట్నంలో ప్రేక్టీస్ చేస్తూ 1926 లో విశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు.
స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీని వదలి పెట్టి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రజా పార్టీలో చేరేరు. విశ్వనాథం 1951లో మద్రాసు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు.
విశ్వనాధం గారు మంచి స్పురద్రూపి, వక్త గానే కాకుండా తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రవేశము ఉన్న వ్యక్తి. విశ్వనాధం గారు విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి చెప్పుకోదగ్గ కృషి చేశారు. ఈయన కాఫీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న రోజులలోనే అరకు లోయలో కాఫీ తోటలు వేయించటం మొదలు పెట్టేరు.
ఈ సేవని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం పురజనులు వారి పురపాలక సంఘం భవనానికి “తెన్నేటి భవన్” అనీ, వారి ఊరిలో ఉన్న ఒక పార్కుకి “తెన్నేటి పార్క్” అని పేరు పెట్టుకున్నారు.
More About : Tenneti Viswanadham
తెన్నేటి విశ్వనాథం క్విజ్