వందేమాతరం రామచంద్రరావు
VandeMataram Ramachandrarao
VandeMataram Ramachandrarao – Quiz : వందేమాతరం రామచంద్రరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు హైదరాబాద్‌స్టేట్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిజాం సంస్థానాన్ని భారతదేశంవిలీనం చేయడానికి చేసిన కృషికి గాను ఇతడిని వందేమాతరం పేరుతో గౌరవిస్తూ వస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావు రెండు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఇతడు రెండు పర్యాయాలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.
వావిలాల రామచంద్రరావు 1918, ఏప్రిల్ 25వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా, క్యాతూరులో వావిలాల వారింట జన్మించాడు[1]. తండ్రి వావిలాల రామారావు – తల్లి రామలక్ష్మమ్మ. ఇతడు గద్వాలలో మాధ్యమిక పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించి కొంతకాలం కర్నూలులో చదివాడు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాదు చేరి సీతారాంబాగ్‌లో నివసించాడు. అప్పట్లో ఆర్య సమాజనేత, రాంచందర్ దేహెల్వా ఉపన్యాసాలతో ప్రభావితులైన యువకులలో ఇతడు ఒకడు.
1939లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆర్యసమాజ్ – మూడూ కలిసి నైజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పౌరహక్కుల సాధనకోసం సత్యాగ్రహం ప్రారంభించాయి. రామచంద్రరావు జైలుకెళ్ళాడు. జైలులో జరిగిన ఒక సంఘటన ఇతని జీవితంలో మలుపు తెచ్చింది. జైలులో వున్న సత్యాగ్రహులందరూ ప్రతిరోజు వందేమాతరం గీతాన్ని పాడుతుండేవారు. జైలు సూపరింటెండెంట్ వందేమాతరం గీతం జైల్లో పాడటాన్ని నిషేధించాడు. జైలులో వున్న సత్యాగ్రహులు జైలు సూపరింటెండెంట్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ యథావిధిగా పాడేవారు.
జైలు సూపరింటెండెంట్ రామచంద్రరావును పిలిపించి స్వయంగా రెండు చెంపలు వాయించి, 24 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ప్రతి దెబ్బకు రామచంద్రరావు ‘‘వందేమాతరం’’ అంటూ నినాదం చేశాడు. 24 లాఠీ దెబ్బలు తిన్న రామచంద్రరావు తుదకు స్పృహ తప్పిపడిపోయాడు. అప్పటినుంచి ‘‘ప్రజలు’’ ఇతడిని ‘వందేమాతరం రామచంద్రరావు’ అన్న బిరుదుతో గౌరవించారు. తర్వాత అతడు జీవితాంతం వందేమాతరం రామచంద్రరావుగా ప్రఖ్యాతిగాంచాడు.
More About : VandeMataram Ramachandrarao
వందేమాతరం రామచంద్రరావు క్విజ్