తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కందుకూరి వీరేశలింగం

Kandukuri Veeresalingam - Quiz

TeluguISM Quiz - Kandukuri Veeresalingam
0 635

Kandukuri Veeresalingam – Quiz : కందుకూరి వీరేశలింగం (1848 ఏప్రిల్ 16 – 1919 మే 27 ) సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగమ్లో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు.

మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.

అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం(Kandukuri Veeresalingam) తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు.

ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు(Kandukuri Veeresalingam). ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

 

 

More About Kandukuri Veeresalingam

 

కందుకూరి వీరేశలింగం క్విజ్

0%
3 votes, 2.3 avg
40

Quiz : కందుకూరి వీరేశలింగం పంతులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kandukuri Veeresalingam - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. "ఆంధ్ర కవుల చరిత్రను" రచించినదెవరు ?

2. వీరేశలింగం ఎప్పుడు మరణించాడు.

3. కందుకూరి వీరేశలింగం ఏ సంవత్సరంలో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు ?

4. కందుకూరి వీరేశలింగం రాసిన చంద్రమతీ చరిత్రము క్రింది వాటీలో దేనికి సంబంధించినది ?

5. వీరేశలింగం పంతులు ఏ సంవత్సరంలో ఎక్కడ జన్మించారు ?

6. "నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను, అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ "అని కందుకూరిని ఎవరు కీర్తించారు ?

7. కందుకూరి వీరేశలింగంకి గల బిరుదులేవి ?

8. కందుకూరి రాసిన హేళనా పూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం ఏదీ ?

9. కందకూరి సమాజ సేవ కొరకు స్థాపించిన ధర్మ సంస్థ పేరేంటీ ?

10. కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికకు పోటీగా కందుకూరి ఏ హాస్య పత్రికను ప్రారంభించాడు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Also Read : విశ్వనాథ సత్యనారాయణ

Leave A Reply

Your Email Id will not be published!