తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ప్రజాకవి కాళోజి నారాయణరావు

Kaloji Narayana Rao

TeluguISM Quiz - Kaloji Narayana Rao
0 542

Kaloji Narayana Rao : ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న”గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.

 

Kaloji Narayana Rao Video

కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.

నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు. అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు.

అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టబడింది. అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

 

More About Kaloji Narayana Rao

ప్రజాకవి కాళోజి – క్విజ్

 

0%
1 votes, 5 avg
11

Quiz : కాళోజీ నారాయణరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kaloji Narayana Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష అన్నదెవరు ?

2. కాళోజీ జయంతిని తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది ?

3. కాళోజీ కళాక్షేత్రం తెలంగాణ లోని ఏ ప్రాంతంలో ఉంది ?

4. క్రింద ఏ విశ్వవిద్యాలయ కాళోజికి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది ?

5. కాళోజి ఎప్పుడు మరణించారు ?

6. బూర్గుల రామకృష్ణారావు మొదటి అవార్డు గ్రహీత ఎవరు ?

7. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నదెవరు ?

8. ఎక్కడ నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టబడింది ?

9. ఏ సంవత్సరంలో కాళోజీ తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు ?

10. దిగిపొమ్మని,తెగిపొమ్మని ఇదే మాట అనేస్తాను అని నిజాం పై ధిక్కార స్వరం వినిపించిన వారేవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also read: దాశరథి కృష్ణమాచార్యులు

Leave A Reply

Your Email Id will not be published!