తెలుగు ఇజం = మన భాష + మన నైజం

గుర్రం జాషువా

Gurram Jashuva - Quiz

TeluguISM Quiz - Gurram Jashuva
0 656

Gurram Jashuva – Quiz : ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిన‌ందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

చిన్నతనం నుండి జాషువాలో(Gurram Jashuva) సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు.

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

1948 లో రాసిన బాపూజీ – మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా(Gurram Jashuva) సృష్టించిన స్మృత్యంజలి.

 

 

More About Gurram Jashuva 

గుర్రం జాషువా క్విజ్

0%
2 votes, 3 avg
85

Quiz : గుర్రం జాషువా

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Gurram Jashuva - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. "రాజు మరణించె నొకతార రాలిపోయె  

 కవియు మరణించె నొకతార గగన మెక్కే 

 రాజు జీవించు రాతి విగ్రహములందు 

సుకవి జీవించు ప్రజల నాలుకల యందు "        అనే జాషువా రాసిన  పద్యం ఏ లఘుకు కావ్యంలోనిది ?

2. జాషువా విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న రచయిత్రి ఎవరు?

3. "విశ్వనరుడను నేను నాకు తిరుగు లేదు" అని ప్రకటించుకున్న కవి ఎవరు? 

4. నా గురువులు ఇద్దరు" పేదరికం -కులమతం" అన్న కవి ఎవరు? 

5. రాజు గారి మాట తప్పడం వల్ల ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా తన ఏ రచనల్లో అద్భుతంగా వర్ణించారు?

6. క్రింది వారిలో జాషువా సాహిత్యం దృక్పథం- పరిణామం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ?

7. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగే జాషువా రచన ఏది?

8. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కవి జాషువాను ఏ పేరుతో ప్రశంసించే వారు? 

9. గుర్రం జాషువా జయంతి ఎప్పుడు ?

10. "ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే" అనే పద్యం జాషువా రాసిన ఈ నాటకంలోని కాటిసీను పద్యం? 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : కందుకూరి వీరేశలింగం

Leave A Reply

Your Email Id will not be published!