దాశరథి రంగాచార్యులు
Dasaradhi Rangacharya - Quiz
Dasaradhi Rangacharya – Quiz : దాశరథి రంగాచార్యులు (ఆగస్టు 24, 1928 – జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.1928, ఆగస్టు 24 న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ మండలం,చిన్నగూడూర్ లో గ్రామం జన్మించారు.
ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య(Dasaradhi Rangacharya) ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు.
తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు(Dasaradhi Rangacharya) 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
More About Dasaradhi Rangacharya
దాశరథి రంగాచార్యులు క్విజ్