తెలుగు ఇజం = మన భాష + మన నైజం

దేవులపల్లి రామానుజరావు

Devulapalli Ramanuja Rao - Quiz

TeluguISM Quiz - Devulapalli Ramanuja Rao
0 420

Devulapalli Ramanuja Rao – Quiz : దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు.

ఆయన తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు.

1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు.

ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, వక్త, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.

 

More About : Devulapalli Ramanuja Rao

దేవులపల్లి రామానుజరావు క్విజ్

 

0%
0 votes, 0 avg
1

Quiz : దేవులపల్లి రామానుజరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Devulapalli Ramanuja Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దేవులపల్లి రామానుజరావు శోభ పత్రికను ఎప్పుడు ప్రారంభించారు ?

2. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వెలువడిన శోభ పత్రిక ముఖ్య కేంద్రం ?

3. ఏ మధ్యకాలంలో రామానుజరావు సాహిత్య ప్రతినిధిగా రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు?

4. ఏ సాహిత్య సమితికి అభివృద్ధికి 5 దశాబ్దాలపాటు దేవులపల్లి రామానుజరావు కృషి చేశారు ?

5. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వం వహించిన పత్రికలేవి ?

6. ఏ సంవత్సరంలో  రామానుజరావు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.?

7. దేవులపల్లి రామానుజరావు గారి మొదటి గ్రంథం ఏది ?

8. దేవులపల్లి రామానుజరావు - ఒక రేఖాచిత్రం పుస్తక రచయిత ?

9. సాహితీ మేఖల ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ?

10. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఏ సంవత్సరంలో అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : పానుగంటి లక్ష్మీ నరసింహారావు

 

Leave A Reply

Your Email Id will not be published!