తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ధర్మవరం కృష్ణమాచార్యులు

Dharmavaram Krishnamacharyulu - Quiz

TeluguISM Quiz - Dharmavaram Krishnamacharyulu
0 265

Dharmavaram Krishnamacharyulu – Quiz : ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853 – 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు “ఆంధ్ర నాటక పితామహుడు”గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు.

జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు పెట్టుకొనెను. అష్టశతావధాన ప్రదర్శనము గావించి కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మెప్పుల గాంచెను. అదియటుండ, నీయన కాంగ్ల భాషాభ్యాసము చేయవలయునని అభినివేశము కలిగినది. పట్టుదల గలవారగుట ఎవ్.ఏ పరీక్షలో నుత్తీర్ణత నందిరి.

తరువాత అదవాని ‘తాలూకాకచేరీ’ లో గొన్నాళ్ళు లేఖకులుగా గుదరవలసి వచ్చినది. కవికి దౌర్గత్యముకూడ నొకకళ యైనదిగదా ! పాపము నాటికి వీరిది పేదకుటుంబము. ఆదవానిలో సంసారము సరిగ జరుగక బళ్ళారికి వచ్చి కంటోన్‌మెంటు మేజస్ట్రేటు కోర్టు లో ప్రైవేటు వకీలు ‘ గా పనిచేయ మొదలిడిరి. ఆయుద్యోగము వీరి దరిద్ర దేవతను దఱిమివైచినది. వకీలు వృత్తి యందు వీరికి లభించిన యుత్తేజనము ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను.

ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. వారి నాటకములలో నిందులకు నిదర్శనములు పెక్కుగలవు. చదరంగము మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. నెలల తరబడి యనన్య మనస్కులై యాడుచుండువారని ప్రతీతి.

 

More About : Dharmavaram Krishnamacharyulu

ధర్మవరం కృష్ణమాచార్యులు క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : ధర్మవరం కృష్ణమాచార్యులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Dharmavaram Krishnamacharyulu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ధర్మవరం కృష్ణమాచార్యుల రాసి,ప్రదర్శించిన మొదటి నాటకం ఏది ?

2. ధర్మవరం కృష్ణమాచార్యులు ప్రసిద్ధ నాటకాలు?

3. ధర్మవరం కృష్ణమాచార్యులు రచించిన ఇంగ్లీష్ నాటకం పేరు ?

4. ఏ సంస్థానం రాజుతో ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్రనాటక పితామహుడు బిరుదుతో సత్కరించబడ్డాడు ?

5. తెలుగు నాటకాల్లో గద్య పద్యాలతో పాటు పాటలను రాసిన తొలి రచయిత ఎవరు ?

6. ధర్మవరం కృష్ణమాచార్యులు నెలకొల్పిన సరసవినోదిని  నాటకసభను ఎక్కడ ఉంది ?

7. ప్రజాబలంతో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి వాళ్లని వెళ్లగొట్టాలనే సందేశాన్ని ఇచ్చే ధర్మవరం కృష్ణమాచార్యుల నాటకం ఏది ?

8. ఆంధ్రనాటక పితామహుడు బిరుదాంకితులు ఎవరు ?

9. ధర్మవరం రామకృష్ణమాచార్యులు స్మారకార్థం నిర్మించి థియేటర్ పేరు ?

10. ధర్మవరం కృష్ణమాచార్యులకు ప్రసిద్ధి తెచ్చి పెట్టిన నాటకం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Read More : త్రిపురనేని రామస్వామి చౌదరి

Leave A Reply

Your Email Id will not be published!