తెలుగు ఇజం = మన భాష + మన నైజం

వానమామలై జగన్నాథచార్యులు

Vanamamalai Jagannadhacharyulu - Quiz

TeluguISM Quiz - Vanamamalai Jagannadhacharyulu
0 364

Vanamamalai Jagannadhacharyulu – Quiz : వానమామలై జగన్నాథాచార్యులు (డిసెంబరు 19, 1908 – జూన్ 28, 1995) తెలంగాణ రాష్రానికి చెందిన పండితుడు, రచయిత. ‘రైతు రామాయణం’ పేరుతో రైతు శ్రమను,దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెల్పుతూ 3000 పద్యాలతో మహాకావ్యాన్ని రాశాడు. ఈయన వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో డిసెంబరు 19, 1908న జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి తెలుగు సంస్కృతం భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి.

వెయ్యికి పైగా హరికథలను గానం చేసిన జగన్నాథాచార్యులు యాదాద్రి – భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా హరికథాగానం చేయడానికి వెళ్లి, అక్కడ హిందీ వారు ఎక్కువగా ఉండడంతో తెలుగు హరికథలను అప్పటికప్పుడే హిందీలోకి అనువదించుకుని గానం చేశాడు.

‘ధనుర్దాసు’ కథలోని వైష్ణవభక్తి తత్త్వంతో కొన్ని తేటగీతి పద్యాలు, ‘కార్పాసలక్ష్మి’ అనే పేరుతో ఒక వైష్ణవ భక్తురాలి కథను నాటకంగా రాశాడు. ఈయన రాసిన అభ్యుదయ గేయాలు 1952 – 53 సం.లో శ్రీ జువ్వాడి గౌతమరావు ఆధ్వర్యంలో ముద్రించాడు. 1968 సం.లో హుజూరాబాద్ తాలుకాలోని ఇల్లంద కుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామిపై సంస్కృతంలో ‘శ్రీ ఇల్లిందకుంట రఘురాట్ తవ సుప్రభాతమ్’ రాశాడు.

 

More About : Vanamamalai Jagannadhacharyulu

వానమామలై జగన్నాథచార్యులు క్విజ్

0%
1 votes, 5 avg
1

Quiz : వానమామలై జగన్నాథచార్యులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Vanamamalai Jagannadhacharyulu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. వానమామలై జగన్నాథచార్యులు శ్రీవ్రతగీతిని అనువాదించడానికి ఆర్థిక సహాయం చేసినవారు ?

2. రైతు రామాయణం మహాకావ్యాంలో ఎన్ని పద్యాలు కలవు ?

3.  రైతు రామాయణం ఎవరు రాసారు ?

4. వానమామలై జగన్నాథచార్యులు ఎప్పుడు జన్మించారు ?

5. రైతువాల్మీ ఎవరి బిరుదు ?

6. వానమామలై జగన్నాథచార్యులు రాసిన శ్రీవ్రతగీతి ఏ భాషలోనుంచి అనువాదించారు ?

7. కార్పాసలక్ష్మి నాటక రచయిత ?

8. ఏ సంవత్సరంలో వానమామలై జగన్నాథచార్యులు శ్రీవ్రతగీతిని రచించారు ?

9. వానమామలై జగన్నాథచార్యులు రైతు రామాయణంను ఎవరికి అంకితం ఇచ్చారు ?

10. డా.సి.నారాయణరెడ్డి ఏ పేరుతో రైతు రామాయణం మహాకావ్యానికి పీఠిక రాసారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : ధర్మవరం కృష్ణమాచార్యులు

Leave A Reply

Your Email Id will not be published!