తెలుగు ఇజం = మన భాష + మన నైజం

వానమామలై వరదాచార్యులు

Vanamamalai Varadaacharyulu - Quiz

TeluguISM Quiz - Vanamamalai Varadaacharyulu
0 149

Vanamamalai Varadaacharyulu – Quiz : ఈయన వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912 నాడు జన్మించాడు. రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. అయినప్పటికీ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు.

సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు.  హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు.  ఇతని సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించాడు.

ఆ తర్వాత ఇతడు ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నాడు. విశారద పూర్తయ్యాక చెన్నూర్‌ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పాడు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ఇతడిని శాసనమండలికి నామినేట్ చేశాడు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగాడు.

 

More About : Vanamamalai Varadaacharyulu

 

వానమామలై వరదాచార్యులు క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : వానమామలై వరదాచార్యులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Vanamamalai Varadaacharyulu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. వానమామలై వరదాచార్యులు ఎప్పుడు పరమపదించారు?

2. వానమామలై వరదాచార్యులా శతజయంతి ఎప్ఫటి నుంచి ఎప్పటిదాకా  జరిగాయి ?

3. ఆచార్యుల వారెంత గొప్ప కవిశేఖరులో అంత నిరాడంబరజీవులని’ అన్నదెవరు ?

4. వానమామలై వరదాచార్యులు ఎక్కడ జన్మించారు?

5. వానమామలై వరదాచార్యుల ఏ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించినది ?

6. ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి బిరుదాంకితులు ?

7. వానమామలై వరదాచార్యులకు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యత్వము లభించినది ?

8. కూలిపోయే కొమ్మ (వచన కథాకావ్యం) ఎవరి రచన ?

9. ఏ సంవత్సరంలో వానమామలై వరదాచార్యులకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించినది ?

10. పోతనబాల్యం పాఠ్యభాగ రచయిత ఎవరు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : వానమామలై జగన్నాథచార్యులు

Leave A Reply

Your Email Id will not be published!