వాసిరెడ్డి సీతాదేవి
Vasireddy Seethadevi
Vasireddy Seethadevi – Quiz : (డిసెంబర్ 15, 1933 – ఏప్రిల్ 13, 2007) ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి.. ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు.
ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950), తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు, 100 పైగా కథలు రచించారు.
ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 – 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.
More About : Vasireddy Seethadevi
వాసిరెడ్డి సీతాదేవి క్విజ్