తెలుగు ఇజం = మన భాష + మన నైజం

నంది తిమ్మన

Nandi Timmana

TeluguISM Quiz - Nandi Timmana
0 4,041

Nandi Timmana – Quiz : నంది తిమ్మనను మరియు  ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల! ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్తంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత శ్రీ కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను “వాణీ విలాసము” అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.

తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

 

More About : నంది తిమ్మన

 

నంది తిమ్మన క్విజ్

0%
3 votes, 3.7 avg
23

Quiz : నంది తిమ్మన్న

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Nandi Timmana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పుణ్యక వ్రత వృత్తాంతం ఏ కావ్యంలో ఉంది ?

2. నంది తిమ్మన్న గురువు పేరు ?

3. నంది తిమ్మన్నకు గల వ్యవహారా నామం ?

4. వాణి విలాసం రచించిన వారు ?

5. ముక్కు తిమ్మన్న రచించిన పారిజాతాపహరణం కథలోని ప్రధాన పాత్రలు ?

6. మలయమారుత కవిగా పిలవబడే ఘంట సింగన్న క్రింది వారిలో ఎవరికి మామ గారు ?

7. నంది తిమ్మన్న తాతగారి పేరు ?

8. పారిజాతాపహరణ రచన చేసినవారు ?

9. అష్టదిగ్గజాలలో శ్రీ కృష్ణదేవరాయల భార్యైనా తిరుమల దేవికి అరణంగా వచ్చిన కవి ఎవరు ?

10. ముక్కు తిమ్మన్న రచించిన పారిజాతాపహరణం ఏ రకమైన ప్రబంధం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : అల్లసాని పెద్దన

Leave A Reply

Your Email Id will not be published!