అయ్యలరాజు రామభద్రుడు
Ayyalaraju Ramabhadrudu
Ayyalaraju Ramabhadrudu – Quiz : అయ్యలరాజు రామభద్రుడు 16 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని భువనవిజయం లోని అష్ట దిగ్గజాల లో ఒకడు. ఈ విషయము పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు.
ఈయన కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు. ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన “రామాభ్యుదయాన్ని” శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా “సకలకథాసారానుగ్రహము” అనే సంస్కృత గ్రంథము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంథము అలభ్యం. ఈ కవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు.
More About : Ayyalaraju Ramabhadrudu
అయ్యలరాజు రామభద్రుడు క్విజ్