తెలుగు ఇజం = మన భాష + మన నైజం

రామరాజభూషణుడు

Ramarajabhushanudu

TeluguISM Quiz - Ramarajabhushanudu
0 697

Ramarajabhushanudu – Quiz : రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు ‘రామరాజభూషణుడు’ అని పేరు వచ్చింది. ఒక గొప్ప ఆంధ్రకవి.

ఈతని జన్మభూమి బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశమున ఉండెడు భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతాబ్ద మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలియవచ్చుచు ఉంది. ఇతఁడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెనుఁగున లేదు.

రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటియె కానఁబడుచు ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.

 

More About : Ramarajabhushanudu

 

రామరాజభూషణుడు క్విజ్

0%
0 votes, 0 avg
3

Quiz : రామరాజభూషణుడు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Ramarajabhushanudu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. శ్లేషకవితా మూర్తి అనే బిరుదు కలవారు ?

2. చతుర్విద కవితా నిర్మాత అని ఎవరిని పిలుస్తారు ?

3. సంగీత రహస్య కళానిధి అనే బిరుదు కలవారు ?

4. రామరాజభూషణుడు అసలు పేరు ?

5. హరిశ్చంద్ర నలోపాఖ్యానము రచించిన వారు ?

6. వసుచరిత్రలో కవిత్వసంపదకంటే పాండిత్య సంపద ఎక్కువగలదు అని విమర్శించిన వారు ?

7. రామరాజభూషణుడు ప్రథమ కావ్యం ఏది ?

8. భట్టుమూర్తి రచించిన వసుచరిత్రను సంస్కృతంలోకి అనువాదించిన వారు ?

9. భట్టుమూర్తి దేనిని ఆధారం చేసుకొని వసుచరిత్రను రచించాడు ?

10. భట్టుమూర్తి రచించిన కావ్యాలంకార సంగ్రహమునకు మరో పేరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : పింగళి సూరన

Leave A Reply

Your Email Id will not be published!