Sangam Laxmi Bai
Sangam Laxmi Bai - Quiz
Sangam Laxmi Bai – Quiz : సంగం లక్ష్మీబాయి (Sangam Laxmi Bai) (జూలై 27, 1911 – జూన్ 3, 1979) స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్‌సభ సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభ సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయే.
ఈమె 1911, జూలై 27 న ఘటకేసర్ సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి డి. రామయ్య. చిన్నతనంలోనే వివాహమైన తర్వాత బాల్యంలోనే తల్లిదండ్రులు, భర్త చనిపోవడంతో ఆమె అనాథ అయ్యింది. చాలా చురుకైన అమ్మాయి కావడంతో మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. ఈమె కార్వే విశ్వవిద్యాలయం, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ప్రారంభించిన శారదా నికేతన్, మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. నారాయణగూడలో ఉన్న రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది.
More About : Sangam Laxmi Bai
సంగం లక్ష్మీబాయి క్విజ్