తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Pratti Seshayya

Pratti Seshayya - Quiz

TeluguISM Quiz - Pratti Seshayya
0 224

Pratti Seshayya – Quiz: సర్వోదయ సేవకునిగా, సత్యాగ్రాహిగా, అంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో మంచి నాయకునిగా, విశాఖ ఉక్కు ఉద్యమంలోనూ ఆయన చేసిన కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ స్వాతంత్ర్యయోధులు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నాయకుల సమకాలీకులు శేషయ్య(Pratti Seshayya).

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రోద్యమకారుడు ప్రత్తి శేషయ్య(Pratti Seshayya). తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరంగ్రామంలో జన్మించారు శేషయ్య.

తన 17వ ఏట క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించారు ఆయన. 2017 అక్టోబరు 27న తాడేపల్లిగూడెంలో ఆయన మరణించారు.

ఆయన జన్మించిన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని మిలటరీ మాధవరం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక యువకుడైనా భారత సైన్యంలో చేరతారు.

ప్రపంచ యుద్ధాల కాలం నుండి ఇప్పటికీ ఈ ఊరిలో అదే జరుగుతూ వస్తోంది.శేషయ్య(Pratti Seshayya) తన 17వ ఏట దేశ పరిస్థితులను అనుసరించి, సైన్యంలో చేరడం కన్నా స్వాతంత్ర్యోద్యమంలోకి రావడమే ఉత్తమంగా నిర్ణయించుకున్నారు.

1942 ఆగస్టు 17న బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో పెంటపాడులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సహ విద్యార్థులు వరదా బ్రహ్మానందం, మెండు నరసింహారావు, మందలపర్తి సారంగపాణి, చిలుకూరి వీరభద్రయ్యలతో కలసి పోస్టాఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

More About : Pratti Seshayya

 

ప్రత్తి శేషయ్య క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : ప్రత్తి శేషయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pratti Seshayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ప్రత్తి శేషయ్య ఏ సంవత్సరంలో విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు ?

2. ప్రత్తి శేషయ్య వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా చేసుకున్న వివాహాని జరిపించినవారు ?

3. ప్రత్తి శేషయ్య ఏ పార్టీతరుపున ఉపాధ్యక్షునిగా,కార్యదర్శిగా పలు హోదాల్లో జాతీయోద్యమంలో సేవలు కొనసాగించారు ?

4. ప్రత్తి శేషయ్య జన్మించిన ఊరి ప్రత్యేకత పేరు ఏది ?

5. ఏ సంవత్సరంలో జరిగిన ఉద్యమంలో ఆచార్య వినోభాబావేతో కలసి ప్రత్తి శేషయ్య పనిచేశారు ?

6. ప్రత్తి శేషయ్య జన్మస్థలం ?

7. ప్రత్తి శేషయ్య ఏ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ?

8. ఏ సంవత్సరంలో ప్రత్తి శేషయ్య గాంధీ స్మారక పురస్కారం అందుకున్నారు ?

9. ప్రత్తి శేషయ్య ఎప్పుడు మరణించారు ?

10. ప్రత్తి శేషయ్య ఎప్పుడు జన్మించారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : సంగం లక్ష్మీబాయి

Leave A Reply

Your Email Id will not be published!