తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Ketana

Ketana - Quiz

TeluguISM Quiz - Ketana
0 353

Ketana – Quiz : మూలఘటిక కేతన లేదా కేతన (1200-1280) తిక్కన యుగానికి చెందిన తెలుగు కవి. తిక్కన కాలానికి చెందిన కవులలో కేతన ప్రసిద్ధుడు. ఇతని తండ్రి “మారయ”, తల్లి “సంకమాంబ”. కేతన కొంతకాలం “వెంటిరాల” గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడు. తరువాతి కాలంలో నెల్లూరుకు వలస వెళ్ళాడు. అక్కడ అతనికి మహాకవి తిక్కనతో పరిచయం ఏర్పడింది.

దశకుమారచరిత్రము: ఇది సంస్కృతంలో మహాకవి దండి వ్రాసిన వచన రచన “దశకుమార చరిత్ర”కు తెలుగు పద్యానువాదం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి చక్కనైన పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని, ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు.

 

More About : Ketana

 

కేతన క్విజ్

0%
3 votes, 3.3 avg
11

Quiz : కేతన

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Ketana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కాశీ మజిలీ కథల పుస్తకంలా ఉన్నా కేతన రచన ఏది?

2. మూలఘటిక కేతన ఏ శతాబ్దానికి చెందినవాడు ?

3. కేతన రాసిన దశకుమారచరిత్రములో ఎన్ని పద్యాలు కలవు ?

4. కేతన రచించిన విజ్ఞానేశ్వరము ఏవరి రచనకు అనువాదం ?

5. తెలుగులోని మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం రాసినవారు ?

6. సంస్కృతాద్యనేక భాషాకావ్య రచన విశారదుడు అని కేతనను కీర్తించినవారు ?

7. తెలుగులోని మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏది ?

8. కవిత జెప్పి ఉభయకవి మిత్రుమెప్పింప, నరిది బ్రహ్మకైనా నతడు మెచ్చ అని పలికిన కవి ?

9. తెలుగులో మొట్టమొదట కథా కావ్యం ఏదీ?

10. కేతన రచించిన విజ్ఞానేశ్వరము ఏ రచన అనువాదం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : క్షేత్రయ్య క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!