Chittajallu Pullayya – Quiz
Chittajallu Pullayya - Quiz
Chittajallu Pullayya – Quiz : సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనిచేశాడు. తెలుగు చలనచిత్ర పితామహుడి కుమారుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్. ఎస్. ప్రకాష్ దగ్గర భీష్మ ప్రతిజ్ఞ (1921) అనే మూకీ సినిమాకి సహాయకుడిగా పనిచేశాడు.
తర్వాత సినీ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తన స్వస్థలమైన కాకినాడకు తీసుకువచ్చి ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీశాడు. దాన్ని ప్రదర్శించడం కోసం కాకినాడలో స్వంతంగా సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు కట్టాడు. ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా థియేటర్ ను ఒక ఉద్యమం లాగా చేపట్టి గుడారాలు, ప్రొజెక్టర్లూ, కుర్చీలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బెంగాల్, ఒరిస్సాల్లో కూడా ఊరూరా తిరిగి వాటిని ప్రదర్శించాడు.
టాకీ సినిమాలు రాగానే ఆయన దృష్టి చిత్ర నిర్మాణం మీద పడింది. 1933లో సతీ సావిత్రి సినిమా తీశాడు. అది మంచి విజయం సాధించింది. తర్వాత లవకుశ చిత్రం తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. కలకత్తాకు చెందిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, ఈయన రూపకల్పనలో అనసూయ, ధృవ విజయం (1936) అనే చిత్రాలు తీసి రెండింటినీ కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు.
More About : Chittajallu Pullayya
చిత్తజల్లు పుల్లయ్య క్విజ్