సి. నారాయణ రెడ్డి
C Narayana Reddy - Quiz
C Narayana Reddy – Quiz : సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 – జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
సినారె(C Narayana Reddy) రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది.
హైదరాబాదు లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.
సి. నారాయణ రెడ్డి(C Narayana Reddy) 1962 లో గులేబకావళి కథ లోని పాటద్వారా సినిమా రంగం లోకి అడుగు పెట్టారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో పేరుపొందారు. తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశాడు.
More About C. Narayana Reddy
సి.నారాయణ రెడ్డి క్విజ్