తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఎఱ్రాప్రగడ

Errapragada

TeluguISM Quiz - Errapragada
0 1,016

Errapragada – Quiz :  ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే తిక్కన భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది.

సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు “ప్రబంధ పరమేశ్వరుడు” అని బిరుదు ఉంది.

ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామము)లో జన్మించాడు. ఈయన ప్రస్తుత  గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించాడు. వీరు “శ్రీవత్స” గోత్రము “అపస్తంబు” శాఖకు చెందిన బాహ్మణుడు.

ఎర్రన బహుశా క్రీ.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీ చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీ తీరం వరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు.

ఎర్రనకు రెండు బిరుదులున్నాయి  శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి.

ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ “వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె” అని చెప్పాడు.

 

More About : Errapragada

 

ఎఱ్రాప్రగడ క్విజ్

0%
0 votes, 0 avg
5

Quiz : ఎఱ్రాప్రగడ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Errapragada - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఒక ప్రభువు కొలువులో ఆస్థానకవిగా ఉన్నా మహర్షివలె జీవితాన్ని గడపగలిగిన ధన్యుడాయన అని ఎర్రన్న ను కీర్తీంటినవారు ?

2. వేటూరి ప్రభాకరశాస్త్రి ఏ పేపర్లో ఎర్రాప్రగడ రామాయణం" ను ప్రచురించారు ?

ఎఱ్ఱన 3. ఎన్నవ శతాబ్ది వాడు

4. ఎర్రన్న స్వతంత్ర రచన ?

5. ఎవరి కాలంలో తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము  ఆధునికతను సంతరించుకొన్నాయి ?

6. ."ఎర్రాప్రగడ రామాయణం" శీర్షికతో ప్రచురించిన రచనల్లో ఎన్ని పద్యాలు కలవు ?

7. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి అని పేర్కొన్నది ?

8. ఆంధ్ర వాఙ్మయంలో వర్ణనాత్మక విధానానికి ఆధ్యుడు ఎవరు ?

9. ఎర్రన్నను క్రింద పెర్కొన్న విధంగా కూడా పిలుస్తారు ?

10. ఎఱ్ఱన మరణం ఏ కాలంలో జరిగి ఉండవచ్చని అంచనా?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : నన్నయ్య

Leave A Reply

Your Email Id will not be published!