తెలుగు ఇజం = మన భాష + మన నైజం

గరిమెళ్ళ సత్యనారాయణ

Garimella Satyanarayana - Quiz

TeluguISM Quiz - Garimella Satyanarayana
0 446

Garimella Satyanarayana – Quiz :

స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (జూలై 14, 1893 – డిసెంబర్ 18, 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం..” పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది.

అలాగే “దండాలు దండాలు భారత మాత’ అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది.

ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం.. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. మహాత్ముడి బాటలో అహింసా పోరాట పద్ధతికి జైకొట్టిన ఆయన తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని, భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించాడు.

విదేశీయులకు బానిసలయ్యామని వాపోయాడు. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ‘మా కొద్దీ తెల్లదొరతనం..’ పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా (12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా-ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు.

 

More About : Garimella Satyanarayana

గరిమెళ్ళ సత్యనారాయణ క్విజ్

0%
0 votes, 0 avg
2

Quiz : గరిమెళ్ళ సత్యనారాయణ 

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Garimella Satyanarayana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. "ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా" భోగరాజు పట్టాభిసీతారామయ్య రచనను తెలుగులోకి అనువాదించిన వారు ?

 

2. స్వరాజ్య గీతములు ' పుస్తకం రచయిత ?

3. గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన హరిజనుల పాటలు ఏ సంవత్సరంలో వెలువడ్డాయ్ ?

4. గరిమెళ్ళ సత్యనారాయణ ఎప్పుడు మరణించారు ?

 

5. కూలిపోతున్నది -మూల మట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం -కూకటివేళ్ళతో కూలిపోతున్నది పర ప్రభుత్వం' పాట రచయిత ?

6. " నాది నాదనెడు వీడు - మనదిమనదనెడు సద్గానంబుపాడు " అన్నదెవరు ?

 

 

7. మాకొద్దీ తెల్లదొరతనం పాటను ఇంగ్లీషు లోకి అనువాదించినవారు ?

8. మా కొద్దీ తెల్లదొరతనం పాట రచయిత ?

9. 'మదర్ ఇండియా`  ఆంగ్ల కావ్యాన్ని రచించినదెవరు?

10. గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉంది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : దేవులపల్లి రామానుజరావు

Leave A Reply

Your Email Id will not be published!