తెలుగు ఇజం = మన భాష + మన నైజం

గుర్రం జాషువా

Gurram Jashuva - Quiz

TeluguISM Quiz - Gurram Jashuva
0 655

Gurram Jashuva – Quiz : ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 – జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిన‌ందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

చిన్నతనం నుండి జాషువాలో(Gurram Jashuva) సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు.

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

1948 లో రాసిన బాపూజీ – మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా(Gurram Jashuva) సృష్టించిన స్మృత్యంజలి.

 

 

More About Gurram Jashuva 

గుర్రం జాషువా క్విజ్

0%
2 votes, 3 avg
85

Quiz : గుర్రం జాషువా

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Gurram Jashuva - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జాషువా తిరుపతి వేంకట కవులలో ఒకరైన ఏ కవి చేత అందుకున్న గండపెండేరము తన జీవిత కాలంలో

అందుకున్న అత్యున్నత పురస్కారంగా భావించారు?

2. గుడిలో దళితులకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. అని కుల వివక్షతకు గురైన కథానాయకుడు

గబ్బిలంతో కాశీ విశ్వనాధునికి సందేశం పంపే కథాంశంతో వచ్చిన జాషువా రచన ఏది?

3.  జాషువా ద్వితీయ వివాహం ఎవరితో జరిగింది?

4. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కవి జాషువాను ఏ పేరుతో ప్రశంసించే వారు? 

5.  "నీలోనూలు తయారుచేయు మరగాని ప్రతిరాట్నంబుగా.. సాలీడుననియు మొనగడావని విశ్వంబేలా ఘోషించెన్" అని జాషువా ఏ రచన లో 

పేర్కొన్నారు?

6. క్రింది వారిలో జాషువా ఫౌండేషన్ నెలకొల్పిన వారు ఎవరు?

7. జాషువా రాసిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? 

 

8. ప్రకృతి వర్ణశోభితమైన "గిజిగాడు" ఖండ కావ్యాన్ని రచించింది ఎవరు?

9. ఏ సంవత్సరంలో జాషువాకు ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది?

10. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగే జాషువా రచన ఏది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : కందుకూరి వీరేశలింగం

Leave A Reply

Your Email Id will not be published!