తెలుగు ఇజం = మన భాష + మన నైజం

మాదయ్యగారి మల్లన

Madayyagari Mallana

TeluguISM Quiz - Madayyagari Mallana
0 3,670

Madayyagari Mallana – Quiz : మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.

మల్లన 516 గద్యపద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అను మూడు అశ్వాసాల కావ్యమును రచించాడు. ప్రబంధ శైలిలో రచించబడిన రాజశేఖర చరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో చేరకముందే రచించాడు.

రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉంది. సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.

 

More About : Madayyagari Mallana

 

మాదయ్యగారి మల్లన క్విజ్

0%
1 votes, 1 avg
12

Quiz : మాదయ్యగారి మల్లన

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Madayyagari Mallana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. "రసవంతంగా కవిత్వము చెప్పలేనిచో అసలు కవిత చెప్పకుండా ఉండుటయే మేలు" అన్నదెవరు ?

2. మాదయ్యగారి మల్లన గురించి అష్టదిగ్గజ కవులలో పేర్కొన్నద్ది ఎవరు ?

3. మల్లన తండ్రి పేరు ?

4. మాదయ్యగారి మల్లన గురువు ఎవరు ?

5. మొట్టమొదట కల్పిత ప్రభందం ఏది ?

6. మాదయ్యగారి మల్లన ఎవరి ఆస్థాన కవి ?

 

7. ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించి సాహిత్యములో ప్రస్తావించిన మొదటి కవి ?

8. ప్రౌడకవి మల్లన అని ఎవరిని పిలుస్తారు ?

9. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్ళితంతు గురించి వర్ణించిన కవి ఎవరు ?

10. రాజశేఖరచరిత్రలో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : నంది తిమ్మన

Leave A Reply

Your Email Id will not be published!